భార్య స్థానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం, 9492811322
 వేమన మాతృ ప్రేమకు నోచుకోని దురదృష్టవంతుడు  వదినను కన్నతల్లిలా చూసి  మాతృత్వాన్ని పొందిన మహా మనిషి  అన్నను వదినను చూసిన తరువాత ఆదర్శ దాంపత్యం ఎలా ఉండాలో తెలిసిన మహానుభావుడు  పుట్టింట్లో అమ్మ  నూతన వధువుకు చెప్పే మాట అది. ఇక్కడి నుంచి ఈ ఇల్లు నీది. ఏ చిన్న చెడ్డపేరు వచ్చినా అది నీ పుణ్యమే కనుక పొరపొచ్చాలు లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు  నీకు ఏ విధమైన  అడ్డంకులు వచ్చినా  నిన్ను ఆదుకునేది  ఆ ఆపద నుంచి గట్టెక్కించేది  నిన్ను భరించే నీ భర్త ఉన్నాడు అన్న విషయం మర్చిపోకు. ఈ ఇంట్లో నీకు నచ్చిన వారు ఉంటే వారిని కన్నబిడ్డల్లాగా చూసే బాధ్యత నీది  అని బాధ్యతలు ఏమిటో మొదటిసారిగా ఆమెకు తెలిసేటట్లు కూడా చెప్పింది  అమ్మ. వేమన చెప్పిన అద్భుతమైన పోలిక భర్త మనం భోజనం చేసి విడిచి పెట్టిన  విస్తరి  లాంటివాడు  భార్య  ఆకు శుభ్రం చేసి దానిలో అన్ని పదార్థాలూ వొడ్డించితే ఆ బరువు వల్ల ఆకు గాలికి లేవకుండా ఏర్పాటు చేస్తుంది. భార్య  ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాకుండా ఎవరి స్థానం ఏమిటో తెలుసుకుంటే ఆ సంసారం స్వర్గలోకాన్ని మించిన ఆనందాన్ని పొందుతుంది లేదా యమలోకంగా గ్రహించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా దీనిని కోరుకుంటారు స్వర్గాన్నా, నరకాన్నా  ఆ కుటుంబంలో ఎవరికీ ఏ ఇబ్బంది కలిగినా  ఆమెకే చెపుతారు  ఆ సమస్యను ఆమె  అతి స్వల్ప వ్యవధిలోనే పరిష్కరించేస్తుంది  అలాంటి స్త్రీని  నేను భావిస్తున్నాను కనుక  పేరు నాకే రావాలి అనుకుంటే  అంతకు మించిన స్వార్థం మరొకటి ఉండదు. ఆహం కారంతో  విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అక్రమ మార్గాలలో తిరిగే భర్తను  సక్రమ మార్గంలో నడిపించి  అతనికి  మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేలా ఏర్పాటు చేసేది  సంసారం లో పిల్లలకు  ప్రథమ గురువు గా విద్య నేర్పి  వారిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేది  మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఏకతాటిపై నడిపించి  ఆ గ్రామానికి ఆదర్శప్రాయం గా ఉండే ప్రయత్నం చేసి  సఫలీకృతం  అయ్యేది  ఆమె. వేమన రోజులలోనే  ఆడవారిని అతిలోకువగా చూసే స్థితి ఉన్నది అని మనం గమనించవచ్చు. ఆ దుస్థితిని  తొలగించడం కోసమే  వెలుగునిచ్చే ఆమె ఆత్మను ఆర్ప కూడదు అన్న  సందేశాన్ని చెప్పడం కోసమే  వేమన ఆటవెలదిలో ఈ పద్యాన్ని మనకందించారు. ఎక్కడ స్త్రీ గౌరవించబడు తుందో  ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పిన  ఉపనిషత్ వాక్యాన్ని గుర్తుచేస్తూ ఉన్న ఆ పద్యాన్ని  మీరు కూడా ఒకసారి చదవండి.
"భార్య యనెడు నొక్క భారమ్ము లేనిచో  
పుల్లియాకు వోలె పురుషు డెగురు   
దారి తప్పనీని దైవమ్ము భార్య రా..."కామెంట్‌లు