అసూయ-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవుణ్ణి అరిషడ్వర్గాలు ఆవరించి ఉంటాయి వాటిని జయించాలి దానికోసమే తపస్సు చేయాలి అంటే పూర్తి  మనసుతో దానిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత బాగుంటుంది అని  సహజంగా అలాంటి అసూయ ద్వేషం అనేది మేధావి వర్గంలోనే ఉంటాయి అని  చాలామంది చెబుతారు  దానికి కారణం తను తప్ప ఈ గుణాలు కలిగిన వారు మరొకరు లేరు అన్న అహంభావంతో వారు జీవిస్తూ ఉంటారు  దానిని కించపరుస్తూ మరికొంతమంది ఇతని కన్నా అద్భుతమైన రచనలు చేయగలిగిన వారు ఉంటే  వాడు ఎంత వాడి జ్ఞానం ఎంత  భాషే తెలియని వాడికి భావం ఎక్కడి నుంచి వస్తుంది అని ఏద్దేవా చేస్తూ మాట్లాడతారు.ఇది మానవ సహజం అయితే సహజత్వమైన దానిని జయించినట్లయితే వారికి  మంచి పేరు వస్తుంది.
ఇచ్ఛాపురం రామచంద్ర  మంచి రచయిత  సృజన, స్పష్టత  కలిగిన ప్రథమ శ్రేణి నాటక రచయిత. మా నాటక శాఖ చూస్తున్న భూషణ్ రావు గారు ఆయనకి ఆత్మీయ  మిత్రుడు రావు గారు ఒక  ఆలోచన చేసి  భారత దేశంలో ఇందిరా గాంధీ వచ్చిన తర్వాత  కుటుంబ సంక్షేమం ఏర్పాటు చేసింది  తర్వాత కుటుంబ నియంత్రణ నీకు ఒకరు నాకు ఒకరు అని నినాదం వాళ్ళ చిన్నబ్బాయి సంజయ్ గాంధీ కుటుంబానికి ఒకరు చాలు  ఒక్కరు ఉంటే ముద్దు అన్న నినాదంతో  కుటుంబ నియంత్రణ అమలు పరిచారు అమలు చేయకుండా ఉంటే భారతదేశం జనాభా ఎలా ఉంటుంది. అంతమంది దేశంలో ఉంటే వారికి భోజనం కానీ, నివాస స్థలం కానీ  ఎక్కడ అన్న ఆలోచనతో  రామచంద్ర గారు జనం జనం అన్న పేరుతో ఉన్న 150 మంది నటీనటులతో చక్కటి గంట నాటకం రాసి తీసుకొచ్చాడు. నాకు, సివి కి నచ్చింది  ప్రధాన పాత్ర నేను తీసుకొని  చిన్న చిన్న పాత్రలను కళాకారులతో చేయించి  ఈ రోజు రేడియో కేంద్రాన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు వస్తూ ఉంటారు వారందరినీ  భాగస్వాములను చేసి చక్కగా  నిర్వహించాము. ప్రసారం అయిన తర్వాత  మంచి అభిమానాన్ని పొందింది.
సాటి రచయిత వారు కూడా మంచి నాటకాలు రాసి ఆకాశవాణికి ఇచ్చారు. ఆయన పత్రిక ద్వారా ఇలాంటి  చెత్త నాటకాలను రేడియోలో ప్రసారం చేయవద్దు అని పాఠకునిగా పేపర్లో రాశాడు.  ఇంతమందికి నచ్చిన అద్భుతమైనది ఒక్కడికే ఎందుకు నచ్చలేదు అన్నది ప్రశ్న. రామచంద్ర గారిని అడిగితే రచయితకు రచయితకు మధ్య వుండే అసూయ కారణం అన్నాడు  నాకు కూడా అదే అనిపించింది.కామెంట్‌లు