బాల్యం నుండి చట్టాలపై అవగాహన పెంచుకోవాలి; -రిటైర్డ్ ప్రిన్సిపల్-బాలకృష్ణ; - వెంకట్ ; మొలక ప్రతినిధి





 వికారాబాద్ జిల్లా తాండూర్ మండల్
జినుగుర్తి గేటి సమీపంలో
తాండూర్ మోడల్ స్కూల్లో
చైల్డ్ లైన్ 1098
వారి ఆధ్వర్యంలో
లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం 2012
గూర్చి విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్
బాలకృష్ణ సోషల్ వర్కర్ వెంకట్
1098 ప్రతినిధి నర్సింలు
ప్రిన్సిపల్ ప్రకాష్ గౌడ్
పాల్గొని
మొదట పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని (21OCT) విధి నిర్వహణలో
అమరులైన
పోలీసులకు శ్రద్ధాంజలి
ఘటిస్తూ మౌనం పాటించారు.
అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో
రిటైర్డ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు బాలల చట్టాలు హక్కులపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన పెంచుకోవాలన్నారు.
విద్యార్థులు విద్యా హక్కు చట్టం ప్రకారం
ప్రతి ఒక్కరు చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి
నేటి అమ్మాయిలపై
లైంగిక దాడులు
పెరిగిపోతున్న నేపథ్యంలో
సమాజంలో మానసిక అశాంతి
పెరిగిపోతుందన్నారు.
మానవ విలువలు మంటగలుస్తున్న నేపథ్యంలో
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని
భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవనులు కావాలన్నారు.
దానికి పూర్తిస్థాయిలో గురువులు
తల్లిదండ్రులు
 సమాజం
బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ
పసి పిల్లలని చూడకుండా
మానవ మృగాల్లా తయారవుతున్న సమాజంలో
ప్రతి ఒక్కరూ ఆలోచించాలని
అందరూ రాజ్యాంగాన్ని చదవాలన్నారు. ఫోక్స్ యాక్టివ్ 2012 గురించి విద్యార్థులకు వివరించారు. సమాజాన్ని ప్రభావితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య. కవయిత్రి మల్ల. సైంటిస్టు ఏఎస్ రావు. డొక్కా సీతమ్మ టైపిస్టు విట్టలప్ప లాంటి వారి సేవలను పునికి పుచ్చుకొని సమాజానికి ఉపయోగపడే మనుషులుగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో 1098 ప్రతినిధి నర్సింలు గౌడ్. ప్రిన్సిపల్ ప్రకాష్ గౌడ్. వైస్ ప్రిన్సిపాల్ నర్సింలు. జనార్ధన్. ఉపాధ్యాయులు ఇంటర్ ఎస్ఎస్సి విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు