చరితార్ధుడు కలాం ;-కివపర్తి దాలినాయుడు--చిత్రం ; తునికి భూపతి , కరీంనగర్


 //సీసము//
గగనాంతరంగానఘనతర క్షిపణులు
పండించు కర్షకప్రముఖుడతడు!
రోహిణీ గ్రహముచేరోదసి హర్షించె
దేశీయ సంకేతదేశికుండు!
పోఖ్రాను శరమునుపూరించి వదిలిన
వేత్తగా వెలుగొందువిజయుడతడు!
విజనిండియాసృష్టినిజమైన ధ్యేయంబు
కలలను కనమన్నక్రాంతి యతడు!

//తే.గీ//
రాష్ట్రపతులందు పేరైనరాష్ట్ర పతిగ
ధనుషు కోటిని బుట్టినధన్యమతిగ
తిరుగు  గ్రహములా తనిచుట్టు తిరముగాను
జ్ఞాన భాస్కరుండని యెంచి ధ్యాన మొసగు!
---------------------------------------

కామెంట్‌లు