లలితగీతం :- చావు,పుట్టుకల;- కోరాడ నరసింహా రావు !

 పల్లవి :-
     చావు - పుట్టుకల ఉచ్చు లో
చిక్కి...విల - విల లాడకు రా... 
 జీవా..... !  
  సుఖ - దుఃఖాల అడ కత్తెరలో 
పడి నలిగి పోకు రా ఓ జీవా !!
         " చావు - పుట్టుకల.... "
చరణం :-
   జన్మకు కర్మ - కర్మ కు జన్మ... 
తప్పవు తెలియుము రా జీవ !
 కర్మ ఆగితే... జన్మ ఉండదు.... 
మర్మము తెలియుమురా జీవా!
        " చావు - పుట్టుకలు.... " 
చరణం :-
        జ్ఞానము నెరిగి... యోగివి
  యైన...కర్మ విముక్తుడ
  వౌదువురా....!...2  
 సద్గురువునుచేరి సాధనచేసి...
 ఆ పరమ పధమునే    చేరుమురా.... !
 ఆ పరమపధమునేచేరుమురా
ఆ పరమపధమునేచేరుమురా!
       ******
కామెంట్‌లు