గజల్ ; -చంద్రకళ యలమర్తి
మిశ్రగతి :5556
రదీఫ్ :కాశ్మీరం
***

కుంకుమ పూలతో మురిసింది కాశ్మీరం
అందాల హరివిల్లుల విరిసింది కాశ్మీరం

మబ్బులను తాకుతూ యెత్తయిన
కొండలుకద
మనసునే దోచేస్తు మెరిసింది కాశ్మీరం

పచ్చనీ తివాసీ పరచినా దృశ్యములూ 
కన్నులకు విందుగా వెలిసింది కాశ్మీరం

భారతా దేశమే  నినుచూసి గర్వించును 
చల్లనీ గాలిలో వణికింది కాశ్మీరం

చంద్రునీ వెన్నెలే వెలవెలా పోయినాది 
తెల్లనీ మంచులో మునిగింది కాశ్మీరం 
**


కామెంట్‌లు