సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దీమ(వ)సము...ధీమసము
   *****
దీమసము అల్పప్రాణాక్షర పదం. ధీమసము మహా ప్రాణాక్షర పదం.ఈ రెండు పదాలు ఉచ్చారణలో తేడా ఉన్నట్లే, అర్థాల్లో కూడా తేడా ఉండటం గమనించాలి.
 దీమసము ఉంటే ఏదైనా సాధ్యమే. అణువణువునా నింపుకున్న దీమసము సమస్యలను అలవోకగా అధిగమించేలా చేస్తుంది.
దీమసము అంటే ఆలోచన ,చింతన, తలంపు అనే అర్థాలే కాదు ధైర్యము, ధీరత్వము,ఎలమి, ఉత్సాహము, ఉపాయము, ఎత్తుగడ , ప్రయత్నము, పూనిక,జిగీష లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
ఏ పని చేయాలన్నా ముందు ఆ పని చేయాలనే  దీమసము ఉండాలి.
అనాలోచితంగా తొందరపడి చేసే పనులు తగిన సత్ఫలితాలను ఇవ్వవు.
పైవన్నింటితో పాటు ధీమసము కూడా ఉండాలి.
ధీమసము అంటే నేర్పు,కౌశలము,చతురత్వము,నిపుణత్వము, నైపుణ్యము,పాటవము, ప్రావీణ్యము ఇలా చాలా అర్థాలున్నాయి.
దీమసానికి ధీమసము తోడైతే అన్నీంటా జయమే..జీవన గమనంలో   ప్రతి మలుపులో చేసేదిక గెలుపు సంతకమే.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏




కామెంట్‌లు