మా బడి పిల్లలు;---- కయ్యూరుు బాలసుబ్రమణ్యం   శ్రీకాళహస్తి
బడిలో గువ్వలు
గుడిలో దివ్వెలు
అమ్మచేతి బువ్వలు
మా బడి పిల్లలు

సాగరతీర గవ్వలు
ఆకాశాన తారాజువ్వలు
సిరిసిరి నాదపు మువ్వలు
మా బడి పిల్లలు

కథలో బుడుగులు
వానలో గొడుగులు
చదువులో పిడుగులు
మా బడి పిల్లలు

నింగిలో చుక్కలు
నేలపై మొక్కలు
భావి భారత దృక్కులు
మా బడి పిల్లలుకామెంట్‌లు