ధన్యుల జేశాడు -- కోరాడ నరసింహా రావు !
 పురాణపురుషుడుప్రహ్లాదుండు 
 పరమభాగవతోత్తముండు.. !
నిశ్చలభక్తికి.....
           ,నిర్వచనమే ఈతడు !
ఇతనికి  సాటి ఇతనే...  
        వేరొకరు లేని మేటి !!
 తండ్రియే కాదు... మరణమే 
 వచ్చినా...వెనుకడుగేయక ... 
సత్యమునకు వెఱపే  లేదని... 
        చాటి చెప్పినాడు !
శ్రీ హరియే....ద్విరూపావ తారు నిగా, నారసింహుడైభువినుండి దివికి,దిగి... వచ్చినాడు !!
కలడు, కలండను వాడు... 
 కలడో, లేడో యను సంశ యా త్ములకు... సమాధానముగ
 ఇందు గల నందు లేనను సందే హమేల మీకని...ఎందెందు వెద
కిజూచిన అందందే కానగలనని
భక్తుని వాక్యము సత్యమని... 
 నిరూపించుచూ... శిష్టులకు ఒకచేత కమలమును , దుష్టు లకు వేరొకచేత,సుదర్శనమును బట్టి... స్తంభమునుండివెడలి వచ్చినాడు,దర్శనమునిచ్చినాడు....  నమ్మిన భక్తుల ధన్యుల జేశాడు.... !!
    ********

కామెంట్‌లు