మబ్బులమాటున
వెలుగురేఖల
దోబూచులాటలు
మనసు మాటున
తీరని కోరికల
తడబాటులు.
పెదవి మీది నవ్వుల
మాటున మెదిలే
బాధావీచికలు
కరుగుతున్న కలల
వెలుగుతున్న
ఆశాదీపాలు
అవమానాల మాటున
అనుకున్నది సాధించే
నిర్ణయాలు
వెటకారం చేసేవారే
వేడుకునే స్థాయి
రావాలని ప్రతినలు
ఉన్నత శిఖరాల
చేరుకోవాలని
ఉత్సాహాల తరంగాలు
కలవరం తీరిపోయి
కలలన్నీ ఒకేసారి
వరించేలా ఫలితాలు
వెక్కిరించే లోకానికి
ధిక్కరించే జవాబులు
మొక్కవోని పట్టుదలగ
రెక్కల మీద నమ్మకం
చిక్కని చీకటిని
చిందరవందర చేసే
వెలుగుల ఉదయానికి
ఉప్పొంగే భావాల
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి