సుప్రభాత కవిత ; బృంద
మేఘమాలలతో  దోబూచులాట
పచ్చని శాఖలతో సయ్యాట

ఇనుడు నింగినుండీ వదిలిన
వెలుగురేఖల శర పరంపర
నేలకు చేరే క్రమంలో
ముచ్చటైన సరసాలు.

ఆకుల  గలగలల సంబరాలు
గాలుల  ఈలల సరదాలు

విరిసిన పువ్వుల అందాలు
మురిసిన మనసుల  చందాలు

పరచిన పరిమళపు స్వాగతాలు
పిలిచిన పలవరింపుల స్వగతాలు

నిలిచిన నీటి ప్రవాహాలు
వచ్చి చేరిన నీటి వాగులు

ఎంత కమనీయమో ఈ దృశ్యం 
రమణీయమైన అవనీ సౌందర్యం

కన్నులదెంత భాగ్యమో!
చూపులకెంత వరమో!

సూదిగుచ్చు కిరణాల
స్వాగతించు తరుణాన

పొంగిన  భావనల మానసం
పరవశంగ పలికిందీ....

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు