పంచ పదులు; -సుమ కైకాల
మల్లి ఖార్జున స్వామి

శ్రీశైల మల్లికార్జున స్వామి రూపం
మంగళ దాయక మోహన రూపం
చూసినంతనే తొలగిపోవును పాపం
మనసుకి కలుగును మహదానందం
ఓం నమశ్శివాయ అంటే ఇస్తాడు వరం సుమ!
***

భ్రమరాంభికా దేవి

శ్రీశైల గిరి మల్లికార్జున పట్టపు రాణీ 
సోమ శేఖర పల్లవాధరి సుందరీ మణీ 
కొంగు బంగారమైన దైవ శిఖామణీ
కాంతి రేఖల రత్నకుండల భూషిణీ
నీ కృప ప్రసాదించు భ్రమరాoభికా దేవీ సుమా!

కామెంట్‌లు