గుండ్రం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివాకి  మహాగర్వం.పొగరు అందర్నీ ఎద్దేవా చేసేవాడు.అతని దగ్గర రెండు మేకలు ఒక ఆవు ఎద్దు ఉన్నాయి."నామేకల్తో పెద్ద మంద తయారు అవుతుంది. ఆవుకి దూడలు పుడ్తాయి.నాపశుసంపద పెరుగుతుంది. పాలు పెరుగు నెయ్యి వ్యాపారం చేస్తాను."అని గొప్ప గా అందరిదగ్గర డంబాలు పలుకుతూ  బడాయిశివా గాప్రసిద్ధి కెక్కాడు.అతని గొప్పలు వినీవినీ ఓదొంగ ఆవుని కాస్త లాక్కునిపోయాడు. ఊరంతా వెతికినా ఫలితం శూన్యం!పొరుగు వాడు అడిగాడు "ఏమోయ్!ఆవు ఏమైంది?" బింకంగా శివా అన్నాడు "అది కట్టు విప్పుకుని పారిపోయింది.పోనీలే ఎద్దు ఉందిగా! దాన్ని బండికి కట్టి సరుకులు పట్టణంనించి పల్లెకి చేరవేస్తాను.మేకలమందని వృద్ధి చేస్తాను. "కొన్నాళ్ళకు మేకల్ని కూడా ఎవరో ఎత్తుకు పోయారు. " అదేంటి శివా!నీకలలన్నీ కల్లలైనాయికదా?ఎలా?" చనువుగా కామందు అడిగాడు. "ఏముంది!ఎద్దుని అమ్మి కోళ్లు కొంటాను.మానాన్న కోళ్ల వ్యాపారం చేసేకదా మేకలు ఆవు ఎద్దుని కొన్నాడు.తండ్రి అడుగుజాడల్లో నడుస్తాను.కోళ్లు గుడ్లు పెడతాయి.కొన్ని అమ్మి కొన్ని  టిని కోడి దగ్గర పొదిగించి నావ్యాపారం అభివృద్ధి చేసుకుంటాను" ఇన్నాళ్ళు  బీరాలు పలికిన శివా  అహంకారం పొగరు అణిగింది.అంతేమరి! భూమి గుండ్రంగా ఉందని నిరూపించబడింది శివా విషయంలో!తండ్రి ఇచ్చిన పశుసంపదని తన వాచాలత్వంతో పోగొట్టుకున్న శివా కి  బాగా బుద్ధి వచ్చింది 🌹
కామెంట్‌లు