మోసం;- సత్యవాణి
 మోసగించడం కొందరివంతైతే
మోసపోవడం 
కొందరు తమ హక్కుగా
మోసపోతూనే వుంటారు
చెవినిల్లుకట్టుకొని పోరినా
చెడిపోతావని చెప్పినా
చెడిపోయేదాకా మనమాట నమ్మనే నమ్మరు
రాత్రిపడిన గోతులోనే
పట్టపగలు కళ్ళుమూసుకొని దూకుతారు
ఆపై కర్మని నిందిస్తారు
కన్నీటివరదౌతారు

కామెంట్‌లు