- నువ్వెవరివి.. ?(చిత్రకవిత :) కోరాడ నరసింహా రావు !
మన చేతలను ప్రకటించేవి 
 ఎక్కువగా  చేతులే... !

మన హృదయంప్రేమతో నిండి  మన చేతులు  పరిమళాలు 
  వెద  జ ల్లి  తే.... 
  తోటి  మనుషులే కాదు... 
  పశు,పక్ష్యాదులూ,నిర్భ
  యంగా  మనచుట్టూ చేరి పోతాయ్... !

కాకుల్ని ఎంగిలిచేత్తో నైనా... 
  కొట్టని వాళ్ళు... !
 కుక్కకైనా పట్టెడన్నం... 
   పెట్టనివాళ్ళు... !!
వీళ్ళ దరికి యే ప్రాణీ... 
    చేరదు  కదా....!
 ప్రేమ తోనే... ఈ ప్రపంచం... 
 అందాలుచిందుతూ... 
  ఆనందింప జేస్తుంది... !
 కాఠిన్యము - క్రూరత్వము... 
 నీలో  కనిపిస్తే... పశు, పక్ష్యాదులే కాదు... 
   సాటి మనుషులూ, నీదరి 
      చేరరు.... !!
 నీ చేతలు, చేతులు ఇలా... 
 ఈ సీతాకోక చిలుకల్లా  సాటి ప్రాణులన్నిటినీ నీ చుట్టూ... 
  తిప్పుకో గలిగితేనే... 
  నువ్ మానవత్వం మూర్తీభవించిన మనిషివి !
 నిన్ను చూసి, భయపడి... 
   పారిపోతే... నువ్వెవరివి?!
      ******

కామెంట్‌లు