చీకటి వెలుగుల రంగేళి;-సుమ కైకాల
దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం
ప్రకాశవంతమైన కాంతి చూడగానే
మనసులో అలముకున్న అశాంతి
క్షణకాలం మటు మాయమైపోతుంది 

అమావాస్య నిశిలో పున్నమి వెలుగులు
పేద,గొప్ప తేడా లేని అందరి పండుగ
గడప గడపకీ  వెలిగే దీపాల తోరణాలు
ప్రతిఇంటిలో లక్ష్మీ కటాక్షం కోసం పూజలు

మతాబుల వెలుగులతో పోటీపడే పిల్లలు
వెలుగుల పూలను చూసి మురిసే పెద్దలు
కాకర పువ్వొత్తులలా విరిసే ఆనందాలు
ఔట్ల శబ్దాల సందడితో వెలిగే దివ్య దీపావళి!!

కామెంట్‌లు