సంస్కృత ఆది కవి వాల్మీకి;--చంద్రకళ యలమర్తి-విజయవాడ
వాల్మీకి జయంతి సందర్భంగా
=====================
వాల్మీకి మహర్షి క్షత్రియుడుగా జన్మించి
రత్నాకరుడని నామకారణముతో 

బోయవాడుగా, వేటగాడుగా
ఆఖరికి గజదొంగగా జీవించాడు! 

పరివర్తన చెంది వాల్మీకిగా మారి
రాముని సమాకాలీనుడై రామా
యణాన్ని లిఖించిపునీతుడ 
య్యాడు!

సీతమ్మకు  అండగా నిలిచాడు
లవ, కుశులకు తాత ప్రేమ రుచి చూపించాడు, గురువయ్యాడు!

జంట క్రౌంచ పక్షుల విషాద మరణం చూసిన 
శోకంలో నుండి తొలి శ్లోకం రాసాడు!

ఎంతటి పుణ్యపురుషుడయ్యాడు 
సాక్షాత్తు విష్ణు అవతారమయిన

శ్రీ రాముని పరమపావనచరితము రచియించాడు! 
సంస్కృతమున ఆది కవి అతడు!

"ఓం ఐం హ్రీం క్లీం శ్రీం"బీజాక్షర మంత్రాలను ప్రసాదించాడు!
ఆదిత్య హృదయం కూడా రచించాడు! 

ఆనాటి ప్రజలు ఎంతటి అదృష్ట
వంతులు!
త్రేతాయుగములో జీవించిన
సాత్వికులు!

 ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ
 జీవించిన  భాగ్యశాలులు వారు! 
న్యాయం, ధర్మం నాలుగు పాదాల మీద నడచిన కాలమది!

రామరాజ్యం ఆంటే ఏమిటో ఎలా
వుండాలో, ఎలావున్నారోవాల్మీకి
 రామాయణం లో చూపాడు!

మంచి తల్లిగా తండ్రిగా,పుత్రునిగా 
మంచి భర్తగా , భార్య గా ఎలా జీవించాలో లోకానికి తెలియ చెప్పాడు!

అతడిలో నిద్రాణంగా వున్న మంచితనాన్నే ఇతరులలో చూసాడు!
 
లోక కళ్యాణార్థం తాళపత్రాలపై రామాయణము 
శ్లోక రూపంలో గ్రంధస్తం చేసిన
మహా కవి అతడు!

వల్మీకముల మధ్యతపమాచరించి వాల్మీకి అయ్యాడు!
ఆచంద్ర తారార్కం  పేరు నిలుపు కున్నాడు!

కృషి వుంటే మనుషులు ఋషుల
వుతారని
మహాపురుషులు అవుతారని నిరూపించాడు!

మనకు ఆదర్శంగా నిలిచాడు!
వాల్మీకి  కారణ జన్ముడే అతడు! 

ఎన్ని యుగాలు గడచినా మరువలేని మహనీయుడు! 

****
చంద్రకళ యలమర్తి

కామెంట్‌లు