మా బడి;- డి. అభిషేక్ రెడ్డి 8వ తరగతి ఏ సెక్షన్ జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్,సిద్దిపేట్ సెల్ నంబర్ :9704105200
  ఒక పట్టణంలో ఒక బడి ఉండేది. ఆ బడి పేరే ఇందిరానగర్. ఆ బడి అంటే ఎంతో పేరెల్లిన బడి.ఆ బడిలో 1200 మంది విద్యార్థులు ఉంటారు. ఆ బడిలో 30 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అయినా ఆ బడిలో విద్యార్థులు క్రమశిక్షణగా  ఉంటారు.  ఎంతో పెద్దదా  పచ్చదనంతోఉంటుంది.ఆ బడి పెద్ద ఉపాధ్యాయుడు ఎంతో అభివృద్ధి చెందిన వాడు. అలాగే అల్లా ఉన్న ఉపాధ్యాయులు కూడా మంచి పేరు ఎల్లిన వాళ్ళు. వాళ్లందరికీ ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. ఆ బడి పేరు ఎక్కడ చెప్పిన మంచి బడి అని అంటారు. అందులో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిసి  పనిని ముందుకు తోస్తారు. ఒక ఉపాధ్యాయుడు రాకపోయినా ఇంకో ఉపాధ్యాయుడు తరగతి చెపుతారు. మాకు ఏ ఉపాధ్యాయుడు చెప్పినా బాగా అర్థమవుతుంది. విద్యార్థులు ఏం తప్పు చేసిన ఆ పాఠశాలలో  క్షమించరు. విద్యార్థులు ఏ మంచి పని చేసినా 1200 విద్యార్థుల ముందు  అభినందిస్తారు. బహుమతులు కూడా ఇస్తారు. అందరూ ఉపాధ్యాయులు కలిసి పని చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అప్పుడు మా పెద్ద ఉపాధ్యాయుడు ఇప్పుడు ఎస్ ఓ గా ఉద్యోగం చేస్తున్నాడు. మా పాఠశాలకు ఎంతో పేరు ఇంకా. మాకు మా ఉపాధ్యాయుడు రామస్వామి సార్ గారు మాకు ఎంతో క్రమశిక్షణ నేర్పిస్తాడు. మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు  నేర్పిస్తారు.  మా బడిలో చదివిన విద్యార్థులు అందరూ మంచి మా బడిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు.మా బడిలో తెలుగు ఉపాధ్యాయులు మాకు పద్యాలు చాలా బాగా చెబుతారు.మా బడిలో ఉన్న హిందీ ఉపాధ్యాయులు కూడా ఎంతో బాగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెబుతారు. మా ఆంగ్ల ఉపాధ్యాయులు మాకు పద్యాలను అర్థమయ్యేలా  చెబుతారు. మా లెక్కల ఉపాధ్యాయులు మాకు లెక్కలను నేర్పించి ఇంటికి ఇంకా కొన్ని లెక్కలను పెట్టిస్తారు. మా  జీవన శాస్త్రం  ఉపాధ్యాయులు మనుషుల  గురించి చెబుతారు. మా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు భౌతికం గురించి   చెబుతారు. మా సామాజిక ఉపాధ్యాయులు  మంచిగా చెబుతారు. మా ఉపాధ్యాయులందరూ కలిసిమెలిసి   గౌరవంగా మెదులుతారు.

 నీతి : కలిసి ఉంటే కలదు సుఖం. జట్టు కృషి అనేది కలల పని.

కామెంట్‌లు