లక్క ఇల్లు-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 భారతంలో లక్క ఇల్లు ప్రధాన ఘట్టం. అందులో భీముని పాత్ర మరీ ప్రచారం అయింది.  మిగిలిన వారి ప్రాణాలను కాపాడడం కోసం సొరంగ మార్గం నిర్మించడం  రేయింబవళ్ళు వాళ్లకు పనిచేస్తూ రక్షించడం ఆయన విద్ద్యుక్తధర్మం. దానిని గొప్పగా పోషించారు బందా గారికి  మంచి స్నేహితుడు,  సాహిత్యంలో మంచి అభిరుచి కలవాడు, రేడియోకు చాలా నాటకాలు రాశాడు.  ఆ రచయిత పేరు నేమాల వెంకట కోటేశ్వర శర్మ గారు. బందా గారు రంగస్థలంపై ప్రదర్శించిన ఈ నాటకాన్ని  అనేక మార్పులు చేర్పులు చేసి గంటకు కుదించి రేడియో కోసం రాయించాడు.  అందులో విశేషం రంగస్థలంపై భీముడు పాత్రకు  పేరుపడ్డ వేమవరపు శ్రీధర్ రావు గారు ఆవేషాన్ని రేడియోలో ధరించడం  రేడియోలో ఆయన ఎకౌంటెంట్ గా పనిచేశాడు.  దానిలో బందా గారు, నండూరి సుబ్బారావు గారు, నేను, సి.రామ్ మోహన్ రావు గారు, ఎం నాగరత్నమ్మ  దాదాపు అంతా నిలయ కళాకారులం పాల్గొన్నాము.
ప్రపంచ ప్రజల మానవ మనస్తత్వాలను అర్థం చేసుకొని  వ్యాసమహర్షి అద్భుతమైన కళాఖండాలను శాశ్వతంగా అన్ని దేశాలు గుర్తుపెట్టుకోవలసిన  ఉత్తమ గ్రంథాన్ని మనకందించాడు. భారత జాతి గౌరవ ప్రతిష్టలను ఇనుమడింప చేశారు దాని పేరు మహాభారతం. భారతం అంటే అర్థం వెలుగును చూపేది. వెలుగు ఎవరికి అవసరం  అంధకారంలో ఉన్న వాడికి. భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా అది భారతంలో వుంది. భారతంలో చెప్పని కథ ప్రపంచంలో మరెక్కడా లేదు  అని విమర్శకుల చేత అభినందలను పొందిన గ్రంథం.  ఆస్తి తగాదాల్లో అన్నదమ్ముల  విభేదాలు ప్రధానాంశంగా తీసుకొని మానవాళికి వెలుగు చూపిన మహానుభావుడు  వ్యాసమహర్షి. భారతంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఒక అంశం ఈ లక్క ఇల్లు.
ఆ నాటకానికి ప్రాణం పోసింది బందా గారు వారు రంగస్థలం మీద ప్రదర్శించిన నాటకాన్ని  గొప్ప నటులలో ఉన్న మెళకువలను మా ద్వారా చెప్పించారు. బందా గారు నిర్వహించిన ఏ నాటకం కూడా బాగుండలేదు అన్న పేరు తెచ్చుకోలేదు. అందుకే మా పాత్రలు సజీవంగా ఉన్నాయి అని గర్వంగా చెప్పుకుంటాం. అందరి మన్ననలను పొందిన నాటకం అది.

కామెంట్‌లు