చింత...చింత...చింత...;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ మనిషి ఎలా ఉంటారో ఏ క్షణానికి ఎలా మారిపోతూ ఉంటారో చెప్పడం కష్టం. ఒక్కొక్కరికి  ఒక్కొక్క ఆశ ఉంటుంది  దానిని సాధించడం కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు ఆ విషయాలను గురించి తప్ప మరొక విషయాని గురించి ఆలోచన వుండదు. ఒక దేశానికి యువరాజుగా ఉన్నవాడు  రాజు కావాలని తపిస్తాడు  రాజయిన తర్వాత మహారాజు కావాలని  మహారాజు చక్రవర్తి కావాలని  ఎంతో సాధన చేసి దానిని సాధిస్తాడు. ఇలా రాజరికం అంటేనే  రణరంగంతో పని  యుద్ధభూమిలో శత్రు సైన్యాల  తలలు తీయడం వారి పని  ఎంతమంది చనిపోతున్నారు చనిపోయిన వారి కుటుంబాలు ఎలా జీవిస్తాయి అన్న ఆలోచన కలలో కూడా రాదు  అది నా ధర్మం  శాస్త్ర ధర్మాన్ని నేను  పాటిస్తున్నాను తప్ప  మిగిలిన వాటిని గురించి ఆలోచించే అవసరం నాకు లేదు అనిభీష్మించుకొని కూర్చుంటాడు ఆ ఆశ  మరణించేది కాదు ప్రతిక్షణం అలా సుడులు తిరుగుతూనే ఉంటుంది.
మరొక రకం మనుషులు  ఆధ్యాత్మిక విషయాలను చేపట్టి  ఈ భౌతిక ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా  ఆధ్యాత్మికత తప్ప మరొక ఆలోచన లేకుండా జీవిస్తాడు ముని అంటేనే మౌనంగా ఉండేవాడు  ఈ ప్రపంచంలో ఎవరితోనూ అతనికి సంబంధం ఉండదు  ప్రశాంతంగా ఉండే వనాలను  అరణ్యాలను  ఎన్నుకొని అక్కడ ఏకాగ్రతతో  తాను ఏ సత్యాన్ని తెలుసుకోదలుచుకున్నాడో దాని కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు. తన ప్రక్కన తన మీద ఉన్న  చీమలు దోమలు  పాములు  వీటిని లెక్కించడు క్రూర మృగాలు తిరుగాడుతున్న  ప్రదేశం అది. అయినా దేనికి భయపడక  కార్యదీక్షలో పడి దానికోసం తపించడం తప్ప మరొక విషయాన్ని పట్టించుకోడు. కనుకనే  ముని నుంచి ఋషి,  వేదర్షి, బ్రహ్మర్చి స్థితికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు  అది ఆ మౌని చింత.
ఇక సామాన్య మనిషి విషయానికి వస్తే  ఈ పని చేయాలని ఆలోచించడు  పనిచేసి డబ్బు సంపాదించి జీవించాలన్న అవసరం అతనికి ఉండదు. పెద్దలు సంపాదించిన దానిని ఖర్చు చేస్తూ  విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాడు డబ్బు ఉన్నవారికి కావలసినది  మద్యం మగువ తన మనసును మత్తుకు లోను చేసేవి ఈ రెండే. మగువ ఆకర్షించబడుతుంది, ఆకర్షిస్తుంది కూడా  ఒకవేళ తాను బాగా ఇష్టపడి  ఎంత ప్రయత్నించినా  తనకు వశం కాని మగువ కనిపించినప్పుడు  ఎలాంటి ప్రలోభాలకు ఈమె లోబడుతుంది  ఆమె బలహీనత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవరు ఏ ఆలోచన చేస్తూ ఉంటే దానికి పరిష్కారం ఎప్పుడో ఒకసారి  కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నం ఫలించినా, వికటించినా తన  ప్రయత్నం లేకుండా అలా చెంతిస్తూనే ఉంటాడు  ఇలా రకరకాల మనుషుల మనస్తత్వాలను చెప్పినవాడు  జీవితాన్ని కాచి వడపోసిన మహానుభావుడు వేమన. వారి  ఆటవెలదిని ఒక్కసారి చదవండి.

"రాజవరుల కెల్ల
రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరము చింత  
యల్పనరుల కెల్ల నతివలపై చింత.."


కామెంట్‌లు