ఆకలి @కోరాడ నరసింహా రావు
మొద్దు... బద్దకాలను వదిలించి 
బతుకుబాటకు...దారులు వెద కించింది... 
ఆకలే.... !

    మనిషిలో... ఆలోచనలు రేకె త్తిందీ,
అన్వేషణమొదలయ్యిందీ... 
ఆకలితోనే.... !

      నీతి, న్యాయాలనుదూరంచేసిందీ...
   తప్పులుచేయించిందీ ...
      ముప్పులు తెచ్చిందీ...
     ఆకలే... !

  ఈ ఆకలికిపుట్టిన ఆలోచనలు
ఆ ఆకలితోనే ఆగక.... 
   దోచుకోవటం - దాచుకొవటం 
  మొదలవ్వటంతోనే...
,సమస్యలు మొదలయ్యాయి  కదూ... !

ఇవి... అజమాయిషీ కోసం... 
   తహ -  తహ లాడించాయ్ !
అధికారదాహాన్ని పెంచాయ్ !!
అరాచకాలు సృష్టించాయ్ !
తిరుగుబాట్లకు....
           దారులువేసాయి  !!

   అల్లకల్లోలం - అశాంతి... 
ఇంక సమాజం లో... 
.. ప్రశాంత తెక్కడ... !?

ఈ ఆకలి - శోకాలు... 
  సమసిపోయేదెప్పుడు.. !?
   ఈ ప్రపంచం శాంతి, సౌఖ్యాలతో    
         మనగలిగే దెన్నడు.. !!
      *****

కామెంట్‌లు