సుప్రభాత కవిత ; బృంద
ఆటుపోట్లెన్నున్నా
చెదరని సంద్రంలా

ఉనికి కోసం పోరాడుతూ
ఊపిరాపని గుండెలా

చీకటిని వెలి వేసే
వెలుగుల వెల్లువలా

వేదనలెన్నున్నా
వేసారని ఓర్పులా

నిశ్శబ్దం  రాజ్యమేలే
నిశీధిని తరిమేసే ఉషస్సులా

తడి ఆరని కోరికల
ముడి విప్పే వేకువలా

నిరాశకూ నిస్పృహకూ
నీరసం తెప్పించే  ఉదయంలా

దూరమైన గమ్యానికి
చేరువ చేసే నేస్తంలా

పొగమంచు కప్పినా
కరిగించే కిరణంలా

నన్నెవరూ ఆపలేరంటూ
నవ్వుతూ వరమిచ్చే

నారాయణుడి ప్రతిరూపంగా
క్రమం తప్పక అనుగ్రహించే
అరుణుడిని ఆహ్వానిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు