పాపం పడతి (17);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 అత్తారింటికి వచ్చి  కాపురం చేస్తున్న సమయంలో అందరి అభ్యర్థుల తత్వాలను తెలుసుకోవడానికి  భర్తను మాటల్లో పెట్టి  తనకు కావాలని కాకుండా వారి మనస్తత్వాలను భర్తతో చెప్పించే నేర్పు ఒక్క గృహిణికి మాత్రమే ఉంది. దానితో మిగిలిన వారు ఈమెకు ఇది నాకు  ఇష్టమని ఎలా తెలిసింది అబ్బా అని ఆశ్చర్యపోతారు. దానితో వారి బృందంలో చేర్చుకుంటుంది. ఎప్పుడైతే  ఆ స్థితికి వచ్చిందో  ఆ ఇంటికి ఏక చక్రాధిపతి అవుతుంది. ఆమె చెప్పింది వేదం ఆమె చేసిన ప్రతి దానిని  అందరూ ఆమోదించవలసినదే. పిల్లల గారాం తక్కువగా ఉండదు కదా  తల్లి బాధ్యత ఎలా ఉంటుంది  ప్రేమను ఆప్యాయతను పంచుతూ  గారాంగా  చూస్తూ ఉన్నా  తన బాధ్యతను మర్చిపోకూడదు అన్న విషయం  అమ్మ చెప్పిన మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటుంది ఆమె.
పిల్లలు భోజనం చేసేటప్పుడు  వారికి ఇష్టమైన పనులు చేస్తున్న సమయంలోను తాను పిల్లలకు చెప్పవలసిన మంచి విషయాలను చెప్పుకుంటూ వస్తోంది. తన కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి  పూసగుచ్చినట్టు చెబుతూ  అలా ప్రవర్తించకపోయినట్లయితే  చెడ్డ మాట పడతారు అని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పడం  వల్ల ఆ వయసులో ఆ పిల్లలు అవగాహన చేసుకుని అలా ప్రవర్తించడానికి ప్రయత్నించేస్తారు  సామాన్యంగా ఆ వయసులో  పిల్లలు ఎవరైనా సరే ఆటలకు ఇచ్చిన ప్రాముఖ్యత మరి దేనికీ ఇవ్వరు.చివరికి భోజనాన్ని కూడా మరిచిపోయే స్థితి  అంత మైమరిపించే ఆటలలో ఉన్న పిల్లలు తన తోటి వారితో ఆడుకుంటున్నప్పుడు  తల్లి వారి అందరిని గమనిస్తుంది వారితత్వాలు తెలుస్తాయి.
వారిలో మంచి వారు ఎవరో చెడ్డవారెవరో  గ్రహించిన ఆమె  తిన్నగా పిల్లలతో చెప్పదు తల్లి. సందర్భం వచ్చినప్పుడు  రాముడు అలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటిరా  అది పద్ధతేనా  మీరందరూ ఎలా ఉంటున్నారు అతను ఎలా ఉంటున్నాడు గమనించారా  మీలా ఉండని వాడితో  ఆటలు ఎందుకురా?  మీ వయసు వారితో మీరు  పద్ధతిగా ఆడతారు అనుకున్న వారితోనే  మీరు స్నేహం చేస్తూ వారితో ఆటల్లో పాల్గొనాలి తప్ప  ప్రతి వారితో ఆడితే  చెడు అలవాట్లు రావడమే కాక  మీరు కూడా వాడి లాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు  కనుక అలా చేయవద్దు అని  పిల్లలకు బాగా నచ్చేలా  అర్థమయ్యేలా చెప్పినప్పుడు  ఇంక వారెప్పుడు ఆ పిల్లలను వారి జోలికి రానివ్వరు. అలా కుటుంబాన్ని కాచి రక్షించవలసిన బాధ్యత  గృహిణి పైనే ఉన్నది అన్నది స్పష్టం.


కామెంట్‌లు