ఏడుకొండల వాడ;-కొప్పరపు తాయారు-సెల్ ; :9440460797
             ఏడేడు లోకాల ఏలేటి వాడ
             ఏడుకొండల పైన నెలవైన వాడ
             తలచుకున్నంతనే దాపునిచ్చేవాడ
             దరి లేని లోకాన దయ చూపు వాడ!

            ఆపదమొక్కులవాడా! అందరివాడ
            అందివ్వనేముంది నా చెంత దేవ
            ఏమీ ఇవ్వలేని దాన ఆదరించవా
            కమనీయ రూప కరుణజూపవా!!

            ఆదుకో రావయ్య ఆపద్బాంధవా
            ఆదరించి కాపాడ రావయ్య అనంతరూప
            నిదురలో నీ మాటే వెతలలో నీ మాటే
           వేయి విధముల నిను ప్రార్ధింతునయ్యా!!

           కాపాడ రావయ్య కరుణతో మమ్ము
           చేయూతనందివ్వ  శ్రీఘ్రమే రావా
           వేరెవ్వరు దిక్కు నాకు వేంకటాద్రి వాస!!
           శ్రీ వేంకటేశ్వరా ఆశ్రిత  పారిజాతమా!

          దయాస్వరూప దయార్ద్ర హృదయ
          దరికీ రాగదయ్య  దయతోడ కాపాడ
          చిన చూపు తగదయా చేరి ఆదుకోవయా
          ఆలసించక ఆదరమున వేవేగ రావయ్యా
           వెతలు దీర్చేవాడా శ్రీ  వేంకటేశ్వర !!!
                                          తాయారు


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం