@తలరాత... !(చిత్రకవిత)-- కోరాడ నరసింహా రావు.
బాధ్యత మరచినతాగుబోతు  
మొగుడి తో...ఇద్దరు పిల్లల్ని ఎలా పోషిస్తుంది.... !
ఏదోలా కష్టపడకపోతే,కడుపుకి
కూడు, ఒంటిమీద గుడ్డ ఎలా వస్తాయి !? 
      అందుకే ఇలా...... !
నాగోడు వినేదెవ్వరో, మాకు సాయ పడే దెవ్వరు... !
     "" మా నాయనమ్మ సెప్పేది 
 రెండు పనులు సేస్తే తప్పVమ్మా 
ఒల్లొoచి  కష్టపడ్డానికి సిగ్గు, భయమూ ఎందుకమ్మా " అని 
  అందుకే..   
     నా మొగుడికి బుద్దొచ్చేలా 
ఈ కూలీపనికి వస్తున్నాను !
  నువ్ సంపాదిత్తన్నావ్ కదా 
   నా అవుసరం నీకుండదని 
ఆడు ఎటో  పోనాడు... !

ఆడికినచ్చినట్టుఆడుపోనాడని  
నాకునచ్చినట్టు నానూ పొతే 
పిల్లలకి దిక్కెవరు, అనాధ లై పోరూ.... !

సచ్చీవరకూ తప్పదు నాకీ 
బరువుల మోత.... 
ఏటిసేత్తాను...ఇది నా తలరాత
        ******

కామెంట్‌లు