ఆదర్శం!అచ్యుతుని రాజ్యశ్రీ

 క్రిస్మస్ సెలవులు ఐపోయినా పిల్లలు బడికి చాలా తక్కువ మంది వచ్చారు. క్లాస్ లో  పదిమంది కూడా లేరు.జనవరికల్లా సిలబస్ పూర్తి చేసి రివిజన్ పూర్తి చేయాలని టీచర్ టెన్షన్! అందుకే  ఆరోజు పిల్లలకు ఓ అమ్మాయి నిజగాథని టీచర్ చెప్పింది"మీరు బడి రూల్స్ సరిగ్గా పాటించాలి. అన్ని సౌకర్యాలు వసతులు ఇంటా బైట ఉన్నాకూడా నిర్లక్ష్యంగా ఉండటం పెద్ద తప్పు. మన ప్రధాని మోడీ ఎన్ని సమస్యలు ఉన్నా ఎలా విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు?మనరాష్ట్రపతి ఎలా మన రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారో? రవీనాగుర్జర్ అనే రాజస్థాన్ కి చెందిన అమ్మాయి పగలంతా మేకలు కాస్తూ రాత్రి తన పూరిగుడిసెలో చదువుతూ 12వక్లాస్93శాతం మార్కులతో పాసైంది.తండ్రి చనిపోయాడు. తల్లి కిడ్నీ సమస్య తో బాధ పడుతోంది. చిన్న పూరిపాకలో కరెంటు లేకుండానే ఆమె స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంటికి కరెంటు పెట్టిస్తోంది ప్రభుత్వం". అంతే పిల్లలంతా వెంటనే "మేమూ అలా చదువుతాం టీచర్ "అని అరిచారు🌹
కామెంట్‌లు