పద్మ శ్రీ బందా గారు (13);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మొదట్లో బందా కనకలింగేశ్వర రావు గారు నన్ను, ప్రఖ్యాత రంగస్థల నటుడు కర్ణాటి  లక్ష్మీ నరసయ్యను తెనాలి వాస్తవ్యులు  రంగస్థలంపై అనేక నాటకాలను ప్రదర్శించిన వాడు  రామదాసు ఏకపాత్ర అద్భుతంగా చేయగలిగినవాడు చుండూరు మధుసూదన్ రావును కాంట్రాక్ట్ పద్ధతి మీద ఏర్పాటు చేశారు. తనకు ఒక చిన్న అలవాటు ఉంది. తన వేషం తప్ప మిగిలిన అన్ని అందరి వేషాలను చూస్తాడు.  నీ వేషాన్ని నువ్వు చూడరా  ఇతర వేషాలు నీకెందుకురా? నీ వేషం వచ్చేసరికి నిన్ను నువ్వు మర్చిపోతావ్ అని అనేకసార్లు హెచ్చరిక చేసినా అతనిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో  అతనిని మాన్పించి నన్ను, లక్ష్మీ నరసయ్య గారిని మాత్రమే పిలిచారు. కర్ణాటికి ఒక అలవాటు ఉంది. ఏ పండ్ల సీజన్ వస్తే ఆ పండ్లు  తమ గ్రామంలో తమ  తోటలో పండినవి అని చెప్పి, బజారులో కొనుక్కు వచ్చినవి ఇచ్చేవాడు బందా గారికి.
ఆ పద్ధతి మందాగారికి నచ్చేది కాదు. ఏమిటయ్యా ఇలాంటివి తీసుకొచ్చి నన్ను కాక బట్టి వేషాలు ఎక్కువ ఇప్పించమని కోరడానికా?  ఇక అతనిని పిలవవద్దు అని మాతో చెప్పినన్ను ఒక్కడినే  పిడిచేవారు.  సత్యనారాయణ శాస్త్రి గారు మంచి పండిత కవులు, బందాగారి ఆహ్వానం మేరకు శాస్త్రి గారు అశ్వద్ధామ నాటకాన్ని వ్రాసి తీసుకొచ్చారు. రేడియో కవి సమ్మేళనాలలో  కూడా సనాతన కవిత సౌగంధాలను ప్రేక్షకులకు వాసన చూపేవారు.  విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన కవి సమ్మేళనాలు జరుగుతున్న  దానిలో కూడా నారాయణరెడ్డి, దాశరథి, జాషువా,  శ్రీశ్రీ లతోపాటు ఆయనా పాల్గొనేవారు  అశ్వద్ధామ నాటకంలో అశ్వద్ధామ గా నన్ను  మిగిలిన వేషాలలో వింజమూరు లక్ష్మి నండూరి, రమణారావులతో పాటు జగన్నాధ శర్మ కూడా ఉన్నాడు.బాలగంగాధర్ తిలక్ గారి కవితలు  ఆంధ్రులకు పరిచయమే  కానీ వారు నాటకాలు వ్రాస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన రాసిన అమృతం కురిసిన  రాత్రి - కవితా సంకలనం మంచి ప్రాచుర్యం పొందింది  ఆ గ్రంథం వెలువడడానికి ముందే సుశీల పెళ్లి అన్న నాటిక వ్రాసి రేడియోకి పంపించారు.  బందాగారికి నచ్చి దానిని ఎంపిక చేసి దానిలో సుశీలగా  శ్యామ సుందరి, నేను మాతో పాటు ఏకే ప్రసాద్ చండూరు కూడా నటించాడు.  జయశంకర్ ప్రసాద్ గారు హిందీలో మంచి రచయిత  ఆయన రాసిన స్కంధ గుప్త నాటకాన్ని రాచకొండ నరసింహమూర్తి గారు తెలుగులో అనువాదం చేశారు  మంచి అనువాదకులు  హిందీని ప్రజల వద్దకు  తీసుకు వెళ్ళాలని తమన పడే వ్యక్తి  జగన్నాథ రథచక్రాలు- పద్య కావ్య సృష్టికర్త రాచకొండ నరసింహమూర్తి గారు.

కామెంట్‌లు