నిత్య నూతనం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

భారతీయుడు అన్న శబ్దానికి అర్థం వెలుగు చూపు వాడు  ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ఉపదేశించే వ్యక్తి  భారతదేశంలో  జీవించేవాడు  సూర్యోదయం భారతదేశంలో  జరిగి ప్రపంచం మొత్తానికి చీకటిని ఇస్తుంది. భారతదేశంలో జరిగే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది  ప్రకృతి ఆధారంగా ఏర్పాటు చేసుకున్నవి పండుగలు  తెలుగువారికి  తొలి పండుగ సంవత్సరాది ఉగాది.  ఉగ్ అన్నది ఉకారము అంటే పెరుగుదల  పెరుగుదలకు ప్రారంభం  ఉగాది పండుగ  ప్రతి చెట్టు,  పూత, పింది ఫలాలతో చూడముచ్చటగా ఉంటుంది  ఆ రోజు పరిశుద్ధంగా  సాయంత్రం వరకు ఆనందభరితంగా అన్ని కుటుంబాలను కలుపుకుంటూ ఆత్మీయతలను అనురాగాలను పంచుకుంటూ మన సంస్కృతిని జ్ఞాపకం చేసుకుంటూ గడిపే తొలి రోజు ఉగాది. పాచ్యతుల విషయం మనకు అనవసరం. ఎవరి ఆలోచనలు వారికుంటాయి ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కటిక చీకటితో వాడు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది  ఉషోదయ  తేజస్సుతో కిరణాలతో ఉగాది ప్రారంభమవుతుంది. ప్రకృతి వెచ్చగా హాయిగా ఉంటుంది  మంచుతో గడ్డ కట్టుకొని పోతుంది  భారతీయుడు తీసుకునే ఆహారం  జీవన విధానానికి ప్రత్యేకం. నాడు మనం తీసుకునే పచ్చడి ఆరు రుచులతో  ఉంటుంది.  జీవితంలో మనం అనుభవించే మంచి చెడుల  సమీక్షకు అది తార్కాణం  ఆరోజు ఆహ్లాదకరంగా సమాజానికి పనికి వచ్చే హరికథలు  ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి  ప్రతి సంవత్సరం 60  పేర్లతో  ఆ సంవత్సరము జరిగే భవిష్యత్తును సూచిస్తూ  భవిష్యత్తును సామాన్య ప్రజలకు కూడా అందజేస్తాం.
ఆరోగ్యప్రదమైన భోజనం  ఉగాది ప్రత్యేకత ఆరోగ్య వినాశకారి  కేక్ లాంటి పదార్థాలు వారివి. జీవితం దేదీప్యమానంగా వెలుగులను విరజిమ్మాలన్న మన దృష్టితో  జ్యోతిని వెలిగిస్తాం ఇది భారతదేశ  సంస్కృతి. నిశి రాత్రి  వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పి వేసేది ఇదే మా జీవితం అని ఆనందించేది నూతన ఆంగ్ల సంవత్సరం  ఆరోజు అర్ధరాత్రి  బృందాలుగా ఏర్పడి  వీధులన్నీ తిరుగుతూ అందరి నిద్ర పాడు చేస్తూ కేకలతో  ఎందుకు తిరుగుతూ ఉంటారో ఆంగ్ల నూతన సంవత్సరాది జరుపుకునే వారిలో ఒక్కరికీ తెలియదు. భారతదేశాలన్నీ  భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు  తలవోగ్గి దానిని అనుసరించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటే  మళ్లీ తిమిరాంధ కారంలోకి ప్రయాణం చేయడానికి వారు  ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం. అంత మాత్రం చేత వారి సంస్కృతిని కించపరచడం కాదు  ఎవరి సంస్కృతిని వారు అంగీకరించి దానిని అనుసరించినట్లయితే ఆ దేశం ఉన్నత స్థితిలో ఉంటుంది  దీనికి యువత నడుము కట్టి ముందుకు నడవాలి.



 

కామెంట్‌లు