నిజాయితీ!అచ్యుతుని రాజ్యశ్రీ

 మనమంతా నీతి నిజాయితీ గా ఉండాలి అని చిన్నప్పటి నుంచి చదువుతాం కానీ పెద్ద ఐనాక మోహతమో గుణంతో స్వార్ధపరులుగా మారుతాం.అవతలివారికి మంచి ఎందుకు చేయాలి అనే దుర్బుద్ధి వస్తుంది. శివా దివ్యాంగుడు.చిన్న వ్యాపారం మొదలు పెట్టి అరువు ఇచ్చి మంచి సరుకులు ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు.కానీ లాభంరాలేదు.నష్టపోయాడు.ఇతని నిజాయితీని చూసిన షావుకారు బాగా ఆలోచించాడు.శివా ని డబ్బుఉన్న  గల్లాపెట్టె దగ్గర కూచోపెట్టాడు. "శివా!ఇక్కడి పనివారు సరిగ్గా సరుకులు ఇస్తూ డబ్బు నీకు ఇస్తున్నారో లేదో గమనించు.నిన్నటి దాకా నాకొడుకు ని కూచోపెట్టాను.కానీ వాడు డబ్బు కాజేస్తున్నాడు.పనివారు నాకు చెప్పటానికి భయపడ్తారు."అని ఆబాధ్యత అప్పగించాడు.అంతే శివా సరిగ్గా లెక్క డొక్కా చూసి నిజాయితీ గా ఉండటంతో అతనికి ఇల్లు ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు.వృద్దుడైన వ్యాపారి సేవలో శివా దంపతులు హాయిగా ఉన్నారు. కొడుకు తండ్రిని నిర్దాక్షిణ్యంగా వదిలి వేరే ప్రాంతం కి పోయాడు. నీతినిజాయితీ మనకు కావల్సినవన్నీ ఇస్తాయి సుమా! ఇతరుల బాగులో మనం పురోగమిస్తాము🌺
కామెంట్‌లు