అంపకం;- కొప్పరపు తాయారు
మంచి మనసుతో నిను మదిలోన
నిలుప,ఏల వీడ్కోలు కావలె
 వీడని బంధమా నను వీడలేవు 
వీడ్కోలు ఎవరికి మంచితనానికా?

వీడ్కోలు పదము భయంకరం
వీనులకు గొడ్డలి పెట్టు మన తెలుగు జాతి నిశ్చలమైన,
వెలుగులు పంచు జాతికి ప్రేమాభిమానాల పెన్నిధికి
ఏమని తెలిపెద వీడ్కోలు.
విడిపోతే కదా వీడ్కోలు 
వింతలు సేయ నిజ జీవితాన!!

కాలము కొరకా ఆంగ్లేయుల
సంవత్సరము,పేరు లేదు,ఊరు
లేదు,కానీ వీడ్కోలు చెప్పక తప్పదు 
అది చిన్న విషయం!!

ఇరువది రెండు ఇరువది మూడుగా
మారు పరిస్థితుల మనుగడ జీవిత స

రళి,ఒకేరీతి ఒకే పద్ధతి మార్చేది,
మారేది ఒక్క అంకె మాత్రమే!!

ఏగొప్పలు లేక ఏ మంచియును లేక
సాధారణ జీవనంబొసగె,ఇరువది రెండు నేడు,
రాబోవు ఇరువది  మూడు ఆశలు పెంచు మిత్రుడేమో, 
ఏది ఏమైనా మన భావ నిర్మిత హర్మ్యాలే కదా ఆశలసౌధాలు!!
కామెంట్‌లు