పసివారి ఆలాపన;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఓ దైవమా! మాకుల దైవమా
నీకు ఇది న్యాయమా ధర్మమా
తల్లిదండ్రులు లేని జన్మనిచ్చావు
జన్మనిచ్చి మమ్ముల చిన్నబుచ్చావు!

సర్వాంతర్యామి అని భావించినందుకా
పెద్దల మాట విని మేం సేవించినందుకా
మాతల్లిదండ్రులను ఎందుకు చేశావు దూరం
మా బ్రతుకంతా అయ్యింది మాకెంతో భారం !

మాతా పితలు లేని మా బ్రతుకంతా దండుగ
మేమింకా ఎలా చేసుకుంటాం మా పెద్దల పండుగ
ఏ పండుగ పబ్బం లేకుండా మేం ఎలాగ ఉండాలి?
మీకు సమర్పించే నైవేద్యాన్ని  ఎలాగా వండాలి?

ఈ జన్మకు ఎలాగో అలాగా సరిపెట్టుకుంటాము
మరో జన్మలోనైనా మాకు ఆ భాగ్యం కలిగించు
నీవే మా కుల దైవం అని నిత్యం పూజిస్తున్నాం
తప్పక ఆ భాగ్యం కలిగిస్తావని మేం భావిస్తున్నాం 

ప్రతినిత్యం పూజించిన సేవించిన కనిపించరు మీరు
మా తల్లిదండ్రులే మాకు ఉంటే వారే ప్రత్యక్ష దైవాలౌతారు
మా కోరికను మన్నించి మరో జన్మను ప్రసాదించు
మా తల్లిదండ్రులను అందించి సదా మమ్ముల దీవించు!


కామెంట్‌లు