ఆధ్యాత్మిక ధామం మనసుందర కాశ్మీరం(అచ్యుతుని రాజ్యశ్రీ)
 ఇప్పుడున్న కాశ్మీరులో  సతీసరము అనే సరోవరం ఉండేది. కశ్యపుడు సతీదేవి శివుడికి  బహూకరించాడు. ఆసరోవరంలో జలోద్భవుడు అనే రాక్షసుడు  కశ్యపుని సంతానాన్ని సతాయించేవాడు.అప్పుడు  అనంత నాగుడనే తన కొడుకు సాయంతో  కశ్యపుడు  వరాహముఖం(నేటి బారాముల్లా) అనే కాలువను తవ్వాడు. ఆసరోవరంలోని నీరు పడమట ఉన్న కశ్యప సాగరం చేరేది.అదే నేటి కాస్పియన్ సముద్రం! జలోద్భవుని విష్ణుమూర్తి సంహరించాడు. ఆసరోవరప్రాంతం కశ్యపమైరా అని పిలువబడేది. క్రమంగా కశ్యమైరా కాస్తా  కశ్మీర గా మారింది. గౌరీదేవి తన బుజ్జి వినాయకుడితో  పర్వత మార్గం గుండా వచ్చేది. ఆగౌరీమార్గ్ అన్న పేరు గుల్మార్గ్ గా మారింది. 
కాశ్మీరపురవాసిని శారదాదేవి.శారదాలిపి శారదాపీఠం తో సర్వం శారదామయం ఐన కాశ్మీరం ని చూసి  ఆదిశంకరాచార్యులవారు శృంగేరి శారదాపీఠం నెలకొల్పారు. శ్రీగంధపు మూలవిగ్రహాన్ని శృంగేరి కి తరలించారు. ఆయన కొంత కాలం అక్కడ ఉన్నారు. అదే శంకరాచార్యులగుట్ట గా ఇప్పటికీ పిలువబడుతోంది.ఇది దాల్ సరోవరం పక్కనే ఉంది. 
రామానుజాచార్యులవారు తన 60వ ఏట తన శిష్యుడు కురుత్తాళ్వార్ తో కల్సి కాశ్మీరంని దర్శించుకున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ కేవలం అందాల సీమగానే చూస్తున్నాం.🌷

కామెంట్‌లు