*హనుమాన్ చాలీసా - చౌపాయి 10*
 *భీమరూప ధరి అసుర సంహారే!*
*రామచంద్ర  కే    కాజ    సఁవారే!!*
తా: మారుతాత్మజా! మహానుభావా! భయంకరమైన రౌద్ర రూపమును ధరించి రాక్షసులు అందరినీ మట్టు బెట్టావు. రామచంద్ర మూర్తి కార్యాన్ని చక్కగా నిర్వహించి పూర్తి చేసావు......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం:  ఎక్కడ తగ్గాలో తెలిసిన కార్య సాధకుడు, తత్వజ్ఞాన ప్రదాయకుడు అయిన సీతానందన సమానుడు ఆంజనేయస్వామి. చక్కని వాక్పటిమతో పాటు, సమయా సమయాల పాలన కూడా తెలిసిన వాడు, మన సుగ్రీవ మంత్రి. ఎక్కడ శక్తిని వాడాలి, ఎక్కడ యుక్తిని వాడాలో బాగా తెలిసిన వాడు భరత సమానుడు. వాక్చాతుర్యం ఒక్కటే ఉన్నా చేపట్టిన పని పూర్తి అవదు. అలాగే,  శక్తిని మాత్రమే నమ్ముకున్న పని జరగదు. మానవులుగా మనం చేపట్టిన ప్రతీ పనిని సాధించడానికి, శక్తి, యుక్తి, నేర్పరితనము చాలా అవసరము. వీటితో పాటు, మనల్ని నడుపించే అతీత శక్తి మీద కూడా అచంచల విస్వాసము అవసరము. ఇవి అన్నీ, సమపాళ్ళలో ఉన్నాయి కనుకనే హనుమ తన యజమాని ఇచ్చిన కార్యాన్ని చక్కగా పూర్తి చేయగలిగాడు. చక్కని శక్తి, యుక్తులు, నేర్పరితనము, అచంచల భక్తి విశ్వాసాలు మనకు అనుగ్రహించాలని ........రాజీవలోచనుడు అయిన రామచంద్రమూర్తిని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు