దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (7);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ముద్దనూరు స్వామి  బండి వాడు నమ్రతగా సమాధానం చెప్పాడు  మాయలూరు దాకా నేను రానా అని అడిగాడు. అది మా భాగ్యం ఎక్కండి అంటూ చేయి చాపి సహాయం అందించాడు. బండి వాడు చేయూతతో బండి పైకి కుదురుగా కూర్చున్న తర్వాత ఉమ్ పోనీ అంటూ చెప్పారు రామశర్మ ఎద్దుల బండి ముందుకు కదిరింది ఎద్దుల మెడలో కట్టిన గంటలు ఉదయభానుతున్నాయి  అన్నట్టు నీ పేరేమిటి అబ్బాయ్ అడిగాడు  ఎర్రన్న అంటారు స్వామి అని సమాధానం  మంది ఏ ఊరు  అంటే  ముద్దనూరు స్వామి అని సమాధానం. అయితే చాలా దూరమే అనగానే స్వామి తమరిది ఏ ఊరు అడిగాడు బండి వాడు  చదువు చెప్పే పంతులు ఒక్క ఊరు ఏమిటి  నాయనా అందులో స్థానికులు కానటువంటి నా బోటి వారికి ఏ పూట ఎక్కడ ఉంటే అదే నా ఊరు అనుకోవాలి అని సమాధానం చెప్పాడు.
ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి అని అడిగితే ఉయ్యాలవాడ నుంచి వస్తున్నా నాయనా  అనగానే ఉయ్యాలవాడ నుంచా ఎర్రన్న కళ్ళల్లో మెరుపు స్వామిని వెంకటరెడ్డిని చేసినారా  అన్నాడు  అతని దగ్గర నుంచి వస్తున్న నాయనా అనగానే నిజమా స్వామి వారిని గురించి బాగా విన్నాను  ఆయన ఎట్టా ఉంటాడు స్వామి అనగానే ఉంటాడు చిన్నగా నవ్వుతూ ఉన్నాడు రామ శర్మ చక్కటి రూపం వెడల్పాటి కళ్ళు, గిరజాల జుట్టు చెవులకు దుద్దులు  శిల్కులాల్చి దోవతి ముఖంపై అక్కడక్కడ అమ్మవారి మచ్చలు అనగానే స్వామి నిజంగా అతను ధర్మాత్ముడేనా  అన్నాడు  అలా ఎందుకు అడుగుతున్నావ్ నాయనా ఈ ప్రాంతంలో ధర్మానికి ప్రతీక అతను అనగానే నాకు తెలియక అడుగుతున్నాను స్వామి ఊరికే ఇట్టా అడిగిన వాళ్ళందరికీ ధర్మం చేస్తే ఎట్టా స్వామి  అన్నాడు బండి వాడు. కలిగినప్పుడు ధర్మం చేయడంలో తప్పు ప్రియమైన తన సంపదను తను ఒక్కడే అనుభవించాలి అనుకునేవాడు లోభి  తనతో పాటు ఇతరులు కూడా అనుభవించాలి పదిమందికి ఉపయోగపడాలి అనుకునే వాళ్ళు నిజమైన మనిషి  ధర్మమనేది మనిషి ఎప్పుడు చేస్తూ ఉండాలి నాయనా అప్పుడే అతని జీవితం సార్థకతమవుతుంది  ఇప్పుడు నీవు చేసింది కూడా ధర్మమే అనగానే  ఎంతో ఆశ్చర్యంతో నేనా నేనేం చేశాను స్వామి  అన్నాడు. అడగ్గానే నీ బండిలో కూర్చోవడానికి స్థానం ఇచ్చావు అంటే  అది ధర్మమెట్టవుతుంది స్వామి అన్నాడు అమాయకంగా  తప్పక అవుతుంది నాయన కేవలం ధనధాన్యాలు ఇతరులకు ఇస్తేనే ధర్మం కాదు మాట సాయం చేసినా ధర్మమే అవుతుంది సందర్భాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది.


కామెంట్‌లు