వ వత్తు పదాలు గేయం;- ఎం. వి. ఉమాదేవి--నెల్లూరు
కవ్వముతో చిలికితీసే వెన్నలు, 
తువ్వాయిలు మరి వేసే గంతులు,
నువ్విచ్చిన లడ్డూ మిఠాయిలు,
సువ్వీ సువ్వాలమ్మ పాటలు నాకిష్టం!

పువ్వులతో కూర్చేటి మాలలు,
దువ్వూరు అమ్మమ్మ మాటలు నాకిష్టం!

దివ్వెలవరుసలు దేవాలయంలో
నువ్వే పెట్టు ఎంతో పుణ్యం
నవ్వై రువ్వే పాపల ఆట
గువ్వై ఎగురుట నాకిష్టం!

పువ్వొక్కటైనా అమ్మకి ఇవ్వు
బువ్వో మిఠాయో పెట్టి ముద్దిస్తుంది!!

కామెంట్‌లు