శుచి- శుభ్రత; - సి.హెచ్.సాయిప్రతాప్

 ఈ కలియుగం యొక్క ప్రధాన విశిష్టత మానవులు అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతూ అందునుండి ఉపసమనం పొందేందుకు ఔషధ సేవనం చేస్తుంటారు. అయితే మన ఆరోగ్యం కలకాలం మన స్వాధీనంలో ఉండాలంటే ఉదయం నిద్ర లేవడంనుంచి రాత్రి నిద్రించడం వరకు క్రమశిక్షణ అవసరం. స్నాన, పాన, ఆహారాది వ్యవహారాల్లో శుచి శుభ్రత, సమయపాలనలో క్రమపద్ధతి ముఖ్యం. ప్రకృతి భగవంతుడిలో భాగం. ఆ చైతన్యం అనంతకాల ప్రయోజనకరమైన ప్రణాళికతో కొనసాగుతూ ఉంటుంది. అందులో ప్రతీప్రాణీ కొంత స్వేచ్ఛతో ఆనందంగా జీవించేందుకు తగినంత వెసులుబాటు ఉంటుంది. క్రమశిక్షణతోనే అది విస్తృతం అవుతుంది.
రెండేళ్ళ పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మన ఆరోగ్యాలకు ఒక పాఠం నేర్పింది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సీ విటమిన్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని కరోనా దేశవాసులదరికీ అవగాహన కల్పించింది. అలాగే మనం ఏయే రకాల ఆరోగ్యాలకు ఏయే రకాల ఆహారం తీసుకోవాలో తెలియజేసింది. జీవితంలో శుచి, శుభ్రత పాటించండం ఎంతో అవసరం. అవి లేని ప్రాంతంలో కూరగాయలు,మాంసం , ఆహార పదార్ధాలను కొనకూడదు. ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం క్రమం తప్పక చేయడం,వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కోసం చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం అలవాటుగా చేసుకోవడం ఎంతో అవసరం.
కామెంట్‌లు