శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 గంగానది ఇంకో పేరు జాహ్నవి.బీహార్ లోని జాహంగీర్ అనే పల్లెపేరు ఒకప్పుడు జహ్ను గృహం.ఇక్కడ ఒకానొకప్పుడు జహ్ను అనే ఋషి ఆశ్రమం ఉండేది. గంగానది దీన్ని సమీపించినపుడు ఆయన దీని నీటిని  తాగేశాడు. భగీరధుడు ప్రార్ధించితే ఆయన తన చెవినుంచి గంగ ను వదిలాడు.అందుకే గంగ కు జాహ్నవి అనేపేరు వచ్చింది.
జామాత అంటే అల్లుడు అని అర్ధం. హిందీ లో జమాయీగా మరాఠీ లో  జవాయీ గా మారింది. యాస్కుడు ఇలా అన్నాడు " జాయాం మాతి మినోతి మిమీతే వా" ఋగ్వేదంలో బావ భర్త అని ప్రయోగించడం జరిగింది. అల్లుడు దశమగ్రహం అని ఒకప్పటి మాట!కానీ నేటి అల్లుడు అత్తగారింటి చుట్టూ తిరిగే ఉపగ్రహం అని నేటి చమత్కారం! "సదా వక్ర: సదా క్రూర: సదా పూజామపేక్షతే!
కన్యారాశి స్థితం నిత్యం జామాత దశమోగ్రహ:🌹

కామెంట్‌లు