భారతీయం-- అనుసరణీయం;- ఎం. వి. ఉమాదేవి
భి‌న్నమతాల జాతీయత
ఐక్యతా రాగం అనుసరించే
మానవతా విలువలు 
భారతీయం ప్రత్యేకత!

ఇతిహాసాలు ఉగ్గు పెడితే
పురాణ పాత్రలు ఊయలూపి,
సామెతలు, ధర్మాన్ని గుర్తెరిగి
సహనం సాహసం నేర్పు ను
సత్యం నిత్యమూ 
సరళ సాధనల యోగం!

మంచీ చెడూ విచారణ
పరేంగిత జ్ఞానాన్ని అందించే
కుటుంబ విలువలు!
విశ్వమే మెచ్చిన సందేశం
భవ్య భారతీయము!!
మనమది నిలుపుకోవడం
మీరు నేను పాటించాలి!!

కామెంట్‌లు