* గోధూళి వేళ *;- కోరాడ నరసింహారావు !
*కవన రవళి *గ్రూప్ లో 
*తృతీయ బహుమతి కవిత*

                    *******
ఆలమందలను తోలుకువచ్చే 
సొమ్మల పిల్లల అలికిడి లేదు 
గొడ్లను కాచే గుంటలుఅందరు 
ఏ పేకాటలో కూకున్నారో.... !

పసివిల పొద్దుట ఇప్పటే గాని 
అవి మేత తిన్నదీ లేనిది చూడరు !
 ఆల్ల ఆట, పాటల సందడేగాని 
   ఆటి ఆకలి, దప్పుల ఊసే తలచరు !

ఇది రేపల్లె కాదు,ఈడ కృష్ణయ్యలేడు 
 దిక్కెవరు  ఈ మూగ జీవులకు
కడుపుకింత గడ్డి, కుడితి కరువైనా 
 వాటి రక్తపుబొట్లనే పాలచుక్కలుగ
అందించే త్యాగ ధనులవి 
సాయం సంధ్యలో  తిరుగుముఖముకై 
 ఆత్రపడుచు అవి చూచు చున్నవి !!
...... ******

కామెంట్‌లు