మైమరపు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
 కొన్ని క్షణాలు అందమైన 
దృశ్యాలను చిత్రిస్తుంటే...
మరి కొన్ని వ్యర్థమైన
ఆలోచనలకు ప్రాణం పోస్తున్నాయి...
కొన్ని క్షణాలు కాంతుల
వెలుగులను వెలివేస్తే...
మరి కొన్ని హరివిల్లులోని రంగులను పులుముకున్నాయి...
కొన్ని క్షణాలు రేపటి ప్రణాళికలను 
సిద్ధం చేస్తుంటే...
మరి కొన్ని వెన్నెల రాత్రులను
కాంక్షిస్తున్నాయి...
కొన్ని క్షణాలు అక్షరాల దారాలను అల్లుతుంటే...
మరి కొన్ని హాయైన భావాల
నడుమ ఊగిసలాడుతున్నాయి...
కొన్ని క్షణాలు అనుభవాల గుర్తులను నెమరువేసుకుంటే...
మరి కొన్ని కొంగ్రొత్త ఆశల పూలను పూయించాయి...
కొన్ని క్షణాలు కన్నీటి వీడ్కోలను అందిస్తే...
మరి కొన్ని ఆనందపు జడివానలో తడిపి ముద్ద చేశాయి... 
కొన్ని క్షణాలు మౌన గీతాలై 
పల్లవిస్తే...
మరి కొన్ని ఏకాంతాల మైమరపున ఓదార్పు నందుకున్నాయి...


కామెంట్‌లు