అన్నమే మూలం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తిండిగలిగితే కండ కలుగును  కండ కలవాడేను మనిషోయి అని  గురజాడ అప్పారావు గారు చెప్పిన గేయం  ఎంత అర్థవంతంగా చెప్పారు   సమాజాన్ని ఎంత కూలంకషంగా అర్థం చేసుకోకపోతే అలాంటి మాటలు వస్తాయి వారు చెప్పిన ప్రతి అక్షరం  అర్థవంతమైనదే  మనిషి జీవితం  ఏంటి  తినడానికి బ్రతుకుతున్నాడా బ్రతకడానికి తింటున్నాడా అన్న విషయం  ఎంతమంది కి అర్థమవుతుంది  మహాత్మా గాంధీ చెప్పిన మాట అది  తాను చెప్పడమే కాక ఆచరించి చూయించినవాడు కనుకనే  మహాత్మా అని  రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి  అద్భుత కవి  వర్ణించడం  దానికి వేమన చక్కటి ఉపోద్ఘాతానిచ్చి వివరణ కూడా  ఇచ్చి లోక రీతి ఎలా ఉంటుందో  తన పద్యం ద్వారా మనకు తెలియజేశారు. మానవుడు గాలి పీల్చకుండా  కొన్ని నిమిషాలు  జీవించగలడు  నీరు లేకుండా ఒకటి రెండు రోజులు  మన గలడు  వస్త్రాలు లేకపోతే గోచీతో 
జీవించగలడు ఇల్లు లేకపోతే  ప్రశాంతంగా అరుబయల పండుకొని నిద్ర పోగలరు  కానీ భోజనం లేకుండా ఎన్ని రోజులు జీవించగలరు  ఈ శరీరం పెరుగుదల మనం తీసుకున్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అని  ప్రతి వైద్యుడు చెబుతూనే ఉంటాడు  అలాంటప్పుడు  తను అశక్తత వల్ల కానీ  పరిస్థితుల ప్రాబల్యం వల్ల కానీ  తనకు ఆహారం లేకపోయినప్పుడు  జరిగే పరిణామాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే  వేమన చెప్పదలుచుకున్న విషయం మనకు స్పష్టమవుతుంది  రోజు రోజుకి శరీరం క్షీణించిపోతుంది  చివరకు మంచినీళ్లు త్రాగడానికి కూడా సత్తువ లేకుండా  పోతుంది.
అన్నం లేని వాడికి నీరసం  రాక తప్పదు  విష్ణు శర్మ గారు చెప్పినట్లు  నిద్ర ఆహారం మైధునం ముఖ్య అవసరాలు  ఇలా నీరసంగా ఉన్నవాడికి స్త్రీ వ్యామోహం కానీ  ఆమెతో కలిసి పని చేయాలని కానీ  మనసులో ఉన్నా శరీరం అందుకు  ఉపకరిస్తుందా  లేచి నడవడానికి ఓపిక లేని వ్యక్తి  ఆ బంధాల జోలికి వెళ్లగలడా  దేనికైనా అన్న ప్రసాదం  అన్న బలం ఉంటే  మిగిలిన అన్ని బలాలు దానంతట అవే వస్తాయి  అనుకోకుండా ఆ పడతి తన దగ్గరకు వచ్చి  తన కోరికను తెలియజేసినా  అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి  ఊహకు అందని నీరసం గురజాడ వారు అన్నట్లు  కండలేని వాడికి  ఏ కోరికలు ఉండవు  కనుక వేమన చెప్పిన ఆ సత్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే  ఆ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.

"కూటికి గతిలేక కూర్చున్నవారికి నాడుదానిమీద యాసగలడే యన్న మదము చేత నన్ను మదంబులౌ..."  



కామెంట్‌లు