సభా కార్యక్రమం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మా అమ్మాయి పద్మజ పియుసి చదువుతున్న రోజుల్లోనే  మా అమ్మ వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టింది  తనకు నచ్చిన ఒక సంబంధాన్ని చూడమని నన్ను నా శ్రీమతిని పంపితే  అమ్మాయిని చదివించాలని  కోరుకుంటున్న మాకు  ఆ సంబంధం నచ్చకపోతే బాగుంటుంది  కుర్రవాడు నచ్చాడు ఎం కామ్  యూనివర్సిటీ ఫస్ట్  నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ  మా అమ్మాయికి కట్నం  ఇవ్వను  నేను తీసుకోను నా పిల్లలకు ఇవ్వను అనేసరికి  చిరునవ్వు నవ్వి  మిమ్మల్ని కట్నం ఎవరు అడిగారు  నాకున్న ఆస్తినే నేను తీసుకోవడం లేదు  స్వయంకృషి తో నా జీవితాన్ని కొనసాగించాలని నా అభిలాష  అందుకే మీ ఆదర్శాలు నాకు నచ్చి  మీ అమ్మాయి మా అందరికీ  నచ్చింది కనుక నేను అంగీకరిస్తున్నాను అన్న తర్వాత వివాహం అయింది.
తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నెల్లూరు వచ్చి  వ్యవసాయ విషయాలలో  ఎన్నో కొత్త పద్ధతులను  నెల్లూరు వాసులకు చెప్పడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు  మా అల్లుడు చిరసాని కోటిరెడ్డి గారికి ఉత్తమ రైతుగా బహుమతి ఇచ్చి  నెల్లూరు జిల్లా రైతులను  ప్రోత్సహించమని చెప్పారు రెడ్డి గారు  తనకు సాంస్కృతిక కార్యక్రమాలలో  మంచి అభిరుచి ఉంది  ఎమ్మార్ అప్పారావు గారి దగ్గర నుంచి నా వరకు అనేకమందినిఆహ్వానించి నెలవారీ కార్యక్రమాలు చేశారు  తనకు మొదటి నుంచి గురజాడ అప్పారావు గారు చాలా ఇష్టం వారు రాసిన కన్యాశుల్కం  ఎన్నిసార్లు చదివారో తెలియదు  ఆ రోజుల్లో కన్యలకు  కట్నం ఇవ్వడం  లాంటి అనేక  దురాచారాలను  అప్పారావు గారు గొప్ప గౌరవించారని నమ్మారు. అప్పారావు గారు వ్రాసిన తొమ్మిది గంటల నాటకాన్ని ప్రదర్శింప చేయాలన్న అభిప్రాయంతో అనేకమందిని  కలిసి  చివరకు విశాఖపట్నం సాంస్కృతిక సంస్థ వారి ద్వారా  నెల్లూరులో 9 గంటల నాటకాన్ని ప్రదర్శింపజేశారు  ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యక్రమం  ఆరోజున  టిక్కట్టుకొని  వచ్చిన వారితో హాలు నిండిపోయింది  తర్వాత అంతమంది బయట నిలబడి చూశారు టిక్కెట్టు కొని కూడా  ఆ సందర్భాన్ని పురస్కరించుకొని  ఈరోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరులో  గురజాడ అప్పారావు గారి  జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు
ఈ కార్యక్రమానికి వృద్ధుల కళ్యాణ రామారావు గారు  విశాఖపట్నం నుంచి  ప్రధాన అతిథిగా వస్తున్నారు  చెరసాని కోటిరెడ్డి గారి  అధ్యక్షతన  జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.కామెంట్‌లు