శ్రీబాల గణపతి స్వామి "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098

   బాలుని రూపంలో నున్న
     గణపతి స్వామి వీవె!
     కామితార్ధ ప్రదాయక!
     జయజయ వినాయక!
           ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌శ్రీబాల గణపతి స్వామి... షోడశ (16) గణపతి మూర్తులలో మొదటివాడు! శ్రీస్వామి వారు... ఉదయించే సూర్యుని వర్ణములో వెలుగొందు చున్నాడు! స్వామివారు.. నాలుగు చేతులందు ..అరటిపండు, మామిడి పండు, చెరకుగడ, పనసపండు కలిగియున్నాడు! తనకు ఇష్టమైన కుడుమును, వెలగపండును తొండంతో పట్టుకుని యున్నాడు! అటువంటి, బాలగణపతి స్వామిని పూజించడంవలన బుద్ధివికాసం కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
         🚩ఉత్సాహ వృత్తం, పద్యము
      అరటిపండు, నామ్రఫలము నమరు కుడి కరంబులన్
      చెరుకు గడయు, పనసపండు చేరు నెడమ చేతులన్!
      పరగ తొండమందు వెలగపండొ, కుడుమొ పట్టుచున్
      తిరుగునట్టి బాల గణపతీ! ప్రభూ! గణేశ్వరా!
    [ డా. వెలుదండ సత్య నారాయణ., పరమార్థకవి
గణేశ్వర శతకం.,]
     🕉️గం గణపతయే నమః n
కామెంట్‌లు