శ్రీతరుణగణపతి స్వామి; - "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి: 99127 67098
 🔱తరుణ రూపంలో నున్న
     గణపతి స్వామి వీవె!
     వరసిద్ది వినాయక!
     జయ జయ వినాయక!
           ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
      
 👌శ్రీతరుణ గణపతి స్వామి ... షోడశ గణపతి మూర్తులలో రెండవ వాడు! యవ్వనదశలో నున్న స్వామియే తరుణ గణపతి! ఎర్రటికాంతులతో శోభిల్లు చున్నాడు! శ్రీస్వామివారు.. కుడివైపు చేతులందు.. దంతము, వెలగపండు, వరికంకి, అంకుశమును; ఎడమవైపు చేతులందు కుడుము, నేరేడుపండు, చెరకుగడ, పాశమును... ధరించి యున్నాడు!
       శ్రీ స్వామివారిని పూజించిన వారికి.. దీర్ఘకాల రోగాలు తొలగుతాయి. కార్యసాధనకు అవసరమైన సామర్థ్యం, మనోధైర్యం,.. కలుగుతాయి! శుభ మస్తు!
🚩ఉత్సాహ వృత్తం పద్యము 
     చెరుకు, వెలగ, నేరెడు మరి చెలగగ వరి కంకులున్
     పరగ పాశ, మంకుశంబు వరుస దంత, మోదకాల్
      కరములందు మెరయ లేతకాంతి సూర్యు బోలగా
       నరసికో తరుణ గణపతి! అష్టభుజ! గణేశ్వరా! 
    [ డా. వెలుదండ సత్య నారాయణ., గణేశ్వర శతకం.,]
🕉️ గం గణపతయే నమః!

కామెంట్‌లు