కోరాడ గీతాలు :-
  "ఇది నాది   -  అది నీది... !"
గీత రచన,స్వరకల్పన, గానం...
...కోరాడ నరసింహా రావు !
       *******
పల్లవి :-
..... ఇది  నాది.... అది నీది 
  అనుకుంటామే గానీ.... 
   ఏదీ... యే ఒక్కరిదీ... 
     కానే  కాదురా..... !
  ఏదైనా.... అది అందరిదీ... 
    తెలుసుకోరా   సోదరా.... !!
       " ఇది నాదీ - అది నీది... ! "

చరణం :-
     అన్నీ... పంచ భూతముల 
  . ప్రసాదితాలే.... !
   ఎవరూ... దేనినీ... కొని 
      తేలేదు... !!
  అందరికీ... అన్నింటిపైనా ... 
  హక్కులూ.... బాధ్యతలూ... 
   సమానమేరా... సోదరా... !
   సమానమేరా  సోదరా... !!
     " ఇది నాది  - అది  నీది... "

చరణం :-
       దేనికోసమూ... 
  ఆరాటముతో.. యాతన పడకుము  సోదరా..... !
   ఆరాటము పడితే.... 
  పోరాటము  తప్పదు... 2
నీ కర్తవ్యమునే.... 
          నువ్ చేసుకుపోతే..., 
 అవే హక్కులుగ నీకు... 
 సంక్రమించురా.... !..   2
    "ఇది నాది.... అది నీది... "
       ********

కామెంట్‌లు