క్రీడా పోటీలు

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలంలోఈనెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో కొత్తూరు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు, కడుము వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య తెలిపారు. తొలుత కడుము పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన 
9 క్రీడాంశాల్లో పోటీలకు అర్హతయగు విద్యార్థుల ఎంపిక నిర్వహించబడుతుందని ఆయన అన్నారు. కబడి, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, షటిల్ బ్యాట్మెంటన్, బాల్ బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్ అనే 9 క్రీడాంశాలకు సంబంధించిన 12 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, సుమారు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరు కానున్నారని చిన్నయ్య తెలిపారు. సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు ఈ 400మంది విద్యార్థిణీ విద్యార్థుల వివరాలను సత్వరమే ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని చిన్నయ్య తెలిపారు. ఈ తొమ్మిది క్రీడాంశాల పోటీల్లో విజేతలైన విద్యార్థిణీ విద్యార్థులు పాతపట్నం నియోజకవర్గస్థాయి ఎస్జీఎఫ్ సెలక్షన్లకు అర్హత పొందుతారని ఆయన అన్నారు. వారిని ఈనెల 11వతేదీ నుంచి 16వతేదీ వరకు కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పంపించనున్నామని చిన్నయ్య తెలిపారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుచుకున్న విజేతలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న జిల్లా స్థాయి పోటీలకు అర్హతనొందుతారని చిన్నయ్య తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్యతో పాటు మండలంలో గల వివిధ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు రాజారావు, భాస్కరరావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, రమేష్, మురళి, అనితారెడ్డి, ధనలక్ష్మి, ప్రభావతి, రేవతి, కావ్య, వెంకటేశ్వరరావులు ఈ పోటీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించచున్నారు.
కామెంట్‌లు