పెన్ కౌంటర్స్ ;- ఎం. వి. ఉమాదేవి
గుండె
పదిలంగా ఉంటేనే అన్నీ సఫలం!
ఆధారపడే కుటుంబం పదిలం!

నీకోసం
ప్రాణమిస్తామంటారు మాటవరసకి
గుండె మాత్రం ఎవరూ ఇవ్వరు!

చెమటలు
కక్కే దేహాలు గుండెకిష్టం 
తిని కూర్చోకు చాలా నష్టం!

బ్రతుకుపంటకి
ఏతాం నీళ్లు తోడే పంపు గుండె!
ఎందుకో క్రమం తప్పుతుండె!


కామెంట్‌లు