అమాయకుడు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 కవికి కవిత తప్ప
మరే ధ్యాసా ఉండదు!
ప్రతి ఘటనకూ స్పందించడం తప్ప! 
కవితా ధారగా కరగడం తప్ప! 
జనం బాధే తన బాధగా 
జనం సుఖమే తన సుఖంగా 
ప్రతిస్పందించడం తప్ప! 
కలమే హలం గా
కవితా కేదారాలను పండించడం తప్ప!
కలమే ఖడ్గంగా
కవితా కదనం సల్పడం తప్ప! 
కష్టించినా, సుఖించినా,
క్రోధించినా, రోదించినా
ప్లవించినా, విప్లవించినా
బొట్లు బొట్లుగా కవితలు రాల్చడం తప్ప!
ఐనా పాపం 
కవి అమాయకుడు సుమా!!
*********************************

కామెంట్‌లు