ఆట- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 ఆడుకోవడం 
సృష్టిలోని ప్రాణికోటికి 
సహజలక్షణం 
ఆట
శారీరక మానసిక శక్తుల్ని 
వెలికితీస్తుంది 
రుగ్మతల్ని తగ్గించి 
ఆనందాన్ని ఇస్తుంది 
తారతమ్యాలను 
రూపుమాపుతుంది 
కలుపుగోలుతనాన్ని, సహనాన్ని
పెంచుతుంది 
గెలుపు ఓటముల్ని 
పట్టించుకోకుంటేనే 
ఆనందాల్ని పంచుతుంది 
ఆటలు ఆడని వాడు రోగి 
ఆటలు ఆడేవాడు యోగి 
ఆటలు ఆడడం ఒక యోగం!!
*********************************
;.
కామెంట్‌లు