అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తరువాతి యాత్ర దుర్గి - ఒప్పిచర్ల  ఆ తెల్లవారి యాత్రలో భాగంగా పాత గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన దుర్గికి చేరుకున్నారు రెడ్డి గారు. అక్కడ నాగార్జున శిల్పశాల స్థాపకులు చెన్నుపాటి సీతారామయ్య గారి ఇంట్లో ఉందామని అనుకున్నాడు కానీ అంతలోనే కొలిపర మండలం ముల్లంగి చంచల జగన్నాథం గారు కనిపించి వారి ఇంటికి తీసుకు వెళ్లారు దాదాపు 70 ఏళ్ల నాటి ఇల్లు లోపలనాపరాతి గచ్చు గొయ్య స్తంభాలు దోలాలు దంతేడు పైన నాపరాతి పరుపు. దానిపైన సౌలు మట్టి కప్పు పక్కనే వస్తారా బావి వంటగది స్నానాలుకకి తాను ఎప్పటినుంచో సేకరించి భద్రంగా దాచుకున్న నూలు రకరకాల పూసలు మట్టి బొమ్మలు పురాతన వస్తువుల పట్ల ఆయనకు మొక్కలు ఎక్కువ అనిపించింది రెడ్డి గారికి ఉట్టిమీద నుంచి దించిన  గేదె పాల పెరుగు చిలికి దంచిన జీలకర్ర అల్లం కలిపి కొంత కొత్తిమీర ఉప్పు వేసిన మజ్జిగ ఇచ్చాడు  ప్రయాణంలో అలసిన రెడ్డి గారికి ఉల్లాసాన్ని ఇచ్చాడు మాటా మంత్రి తర్వాత రేపు ఉదయం దుర్గి ఒప్పిచర్ల చూడాలనుకున్న సంగతి చెప్పారు రెడ్డిగారు నేను వచ్చాను అన్న ఆరాటంతో జగన్నాధం గారు నాటు కందిపప్పును శుభ్రం చేసి బచ్చలు పోరా పొన్నగంటి కూర తోటకూర కాడలు కలిపి కొంచెం చింతపండు జత చేసి కలగూర పప్పు దోసకాయ వంకాయ పచ్చిమిరపకాయల పచ్చడి మిరియాలు మెంతులు ధనియాలు జీలకర్ర బాగా దంచి మరిగిన దాకా కాచిన రసం సొరకాయ దప్పళం (పులుసు) పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఎంచుక పసుపు కలిపిన మజ్జిగ చారు ముంత తిరగేసిన ఏమాత్రం గట్టి పెరుగు పెరుగులోకి కరకరలాడే మినప గుమ్మడి వడయాలు వంకాయ దోసకాయ, వరుకు సిద్ధం చేస్తుంటే నేడు తిన  బోయే ముద్ద సిద్ధమకరధ్వజమే అనిపించింది. ఇవేవి చాలవన్నట్టు మునగాకు, పెసర, బద్దల కూర గోరుచిక్కులు వేపుడు చిలగడదుంప వంకాయ పులుసు గోంగూర శనగపప్పు కూర టమోటా గొజ్జు  మినప నూక కంది నూక పచ్చడి ముందుగా ఆరగించడానికి సగ్గుబియ్యం  సన్న సేమ్యాలు బాగా సన్న బియ్యంతో యాలుకలు జీడిపప్పు కలగలుపు పాయసం ఒకటేమిటి ఎన్ని రకాలు పలనాడులో సరైన భోజనం దొరక్క జొన్న శ్రీనివాసులు ఈ ఇంట ప్రత్యేకమైతే ఎంత బాగుంటుందో అనిపించింది రెడ్డి గారికి  అన్ని ఆరుగంటడానికి అరగంట పట్టింది ఔషధ సమన్విత ఆహారం అబ్బురపరిచింది పోయిన మతి మళ్ళి తిరిగి వచ్చినట్లు అనిపించింది జగన్నాధం గారికి ధన్యవాదాలు చెప్పి రేపటి తన వారసత్వ స్థలాల యాత్ర గురించి ముచ్చటిస్తుంటే అందించిన కప్పుర విడియం మెల్లగా జో కొట్టి నిద్ర పుచ్చింది అది జగన్నాథం గారి ఆతిథ్య చిక్కదనం.


కామెంట్‌లు